ఈసారి నో హల్వా వేడుక.. స్వీట్స్ మాత్రమే

న్యూఢిల్లీ: ఆర్థిక‌మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ ఫిబ్ర‌వ‌రి 1న 2022-23కి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. కాగా నాలుగోసారి బ‌డ్జెట్ ని ప్ర‌వేశ‌పెడుతున్నారామె. ఈసారి సాంప్ర‌దాయ‌క హ‌ల్వా వేడుక లేకుండానే బడ్జెట్ ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. బడ్జెట్ ముద్ర‌ణ‌కు ముందు ప్ర‌తి సంవ‌త్స‌రం హ‌ల్వా సెర్మ‌నీ వేడుక‌ని నిర్వ‌హిస్తుంటారు. కోవిడ్ కార‌ణంగా ఓన్లీ స్వీట్స్ ని మాత్ర‌మే అందించ‌నున్నారు. బడ్జెట్ ముద్రణకు ముందు జరుపుకునే సాంప్రదాయ ప్రీ-బడ్జెట్ ఈవెంట్.

చాలా కాలంగా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ముగియడంతో మిఠాయిలు తిని బడ్జెట్ ముద్రణను లాంఛనంగా ప్రారంభించినట్లు చెబుతున్నారు. ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ నార్త్ బ్లాక్ నేలమాళిగలో ఈ వేడుక జరుగుతుంది. బడ్జెట్‌ ప్రకటనకు ముందు ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా జరుపుకునే హల్వా వేడుకను ఈ ఏడాది జరుపుకోకపోవడం కొత్త విషయం. బదులుగా ఉద్యోగులకు మిఠాయిలు పంచనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/