నేడు ఉన్నావో అత్యాచారం కేసులో తుది తీర్పు!

2017లో బాలికపై అత్యాచారం

Unnao rape-case
Unnao rape-case

న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు ఈరోజు ఉన్నావో అత్యాచారం కేసులో తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భవితవ్యం నేటితో తేలిపోనుంది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువతిని కిడ్నాప్ చేసిన సెంగార్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదే కేసులో శశిసింగ్ అనే వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ కేసు యూపీ నుంచి ఢిల్లీ జిల్లా కోర్టుకి బదిలీ అయింది. ఈ కేసును రహస్యంగా విచారించిన ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ ఈ నెల 16న (నేడు) తీర్పు ఇవ్వనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/