సినీ ఇండస్ట్రీలో విషాదం..

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ ఎల్‌ఎం (35) గుండెపోటుతో మరణించారు. తమిళనాట కౌశిక్ కు ఎంతో పేరుంది. సినిమాల విశేషాలు, కలెక్షన్లు తదితర అంశాలపై ఆయన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఎంతో సమాచారాన్ని అందిస్తుంటారు. ట్విట్టర్ లో ఆయనను ఎందరో ఫాలో అవుతుంటారు.

సెలబ్రిటీలను ఆయన చేసే ఇంటర్వ్యూలు కూడా సినీ అభిమానులను ఎంగానో ఆకట్టుకునేవి. చనిపోవడానికి ఆరు గంటల ముందు కూడా ఆయన ‘సీతారామం’ సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశారు. వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్ల గ్రాస్ ను ఈ సినిమా సాధించిందని… ఇది అఫీషియల్ అని తెలిపారు. వృత్తి రిత్యా ఇంజ‌నీర్ అయిన కౌశిక్ ప్ర‌ముఖ త‌మిళ యూట్యూబ్ ఛానెల్ బిహైండ్ వూడ్స్‌లో ఫిల్మ్ క్రిటిక్‌గా వృత్తిని ప్రారంభించాడు. కౌశిక్‌ మృతి పట్ల దుల్కర్​ సల్మాన్​, కార్తి, విజయ్​దేవరకొండ, ధనుష్​, కీర్తిసురేశ్​ సహా పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.