ఎఫ్టిఐఐలో ఐదు కోర్సులకు ఏఐసిటిఈ అనుమతి

న్యూఢిల్లీ: పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టిఐఐ)లో మరో ఐదు కోర్సుల నిర్వహణకు ఆల ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుమతినిచ్చింది. అప్లైడ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ విభాగాల్లో ఈ నూతన కోర్సులకు అనుమతిని మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఇటువంటి గుర్తింపు పొందిన ఒకే ఒక్కసంస్థగా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సంస్థ నిలిచింది. ఈ ఐదు ఎఫ్టిఐఐఈ కోర్సుల్లో నాలుగు టెలివిజన్ రంగానికి చెందినవి, మరొకటి ఫిల్మ్స్ విభాగం.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/