బిజెపిలో చేరిన ప్రముఖ హీరోయిన్‌

Priya Raman
Priya Raman

తిరుపతి: ప్రముఖ సినీ నటి ప్రయారామన్‌ బిజెపిలో చేరారు. ఆమె బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కమలం గూటికి చేరారు. కాషాయ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రియారామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో తన రోల్ మోడల్ నరేంద్ర మోడీ అని చెప్పారు. పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తనకు పదవులు ముఖ్యం కాదని పేర్కొన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/