పింఛను సంస్కరణలపై పోరాటం ఉధృతరూపం

France
France

పారిస్‌: ఫ్రాన్సులో పింఛను సంస్కరణలపై పోరాటం ఉధృతరూపం దాల్చింది. అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌ ప్రతిపాదిస్తున్న పెన్షన్‌ సంస్కరణల బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెన్షన్‌ సంస్కరణల బిల్లు ముసాయిదాపై ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లో చర్చ ప్రారంభించింది. ఈ బిల్లును గట్టిగా సమర్థించిన కొత్త ఆరోగ్య మంత్రి ఆలివర్‌ వెరాన్‌ మాట్లాడుతూ ఇది సామాజిక భద్రతకు మూలస్థంభం వంటిదన్నారు. ప్రస్తుతం దాదాపు 42 రంగాలకు వర్తిస్తున్న పింఛను విధానం స్థానంలో అందరికి వర్తించే పాత నిబంధనలతోనే పాయింట్ల ఆధారిత పెన్షన్‌ వ్యవస్థను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/