కుప్పకూలిన విమానం.. 16 మంది మృతి

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మరణించగా సుమారు ఏడుగురు గాయపడ్డారు. ఎల్ -410 టర్బోలెట్ విమానం రష్యాలోని టాటర్‌స్థాన్‌లో ఆదివారం కూలిపోయింది. 23 మంది ప్రయాణికులు ఉన్న చిన్న విమానం ఉదయం 9:11 గంటలకు (మాస్కో సమయం ప్రకారం) మెన్జెలిన్స్క్ నగరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా గాయపడిన సుమారు ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. విమానంలోని 23 మందిలో 21 మంది పారాచూట్ డైవర్స్ అని రష్యా వార్తా సంస్థ తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/