తెలంగాణలో మరోసారి ఫీవర్ సర్వే

హైదరాబాద్ : తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు, బి అర్ కే భవన్ లో జరిగే ఈ కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీరు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించనున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఫీవర్ సర్వే ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ అంశంపై చర్చించి, నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/