Auto Draft

‘మనస్విని’ వ్యక్తిగత సమస్యలకు పరిష్కార మార్గం

Feeling very depressed!
Feeling very depressed!

మేడమ్‌, నా వయస్సు 40సంవత్సరాలు, ఈ మధ్యనే నాకు కిడ్నీ సమస్య అని తెలిసింది. ఇప్పుడు చాలా భయంగా ఉంది. చాలాకుంగు బాటుకి లోనవుతున్నాను. ఏంచేస్తే నేను మరల మామూలుగా ఆరోగ్యంగా ఉండగలను? కొంచెం వివరించండి. -ప్రియమణి, హైద్రాబాద్‌.

మీరు తప్పక ఈ కిడ్నీ సమస్యను నివారిం చుకోగలరు. తక్షణమే వైద్యులను సంప్రదిం చండి. వారి సలహాలు, చికిత్సలుచక్కని మేలు చేస్తాయి. కానీ మీరు చెయ్య వలిందల్లా, ఆందోళనగా లేకుండటం, ఆనందంగా ఉండటం.

ఆదుర్దా వద్దు. కుంగుబాటు వద్దు, భయం వద్దు. జరిగిన దీని గురించి చింతించవద్దు. ఇప్పుడు మీరు ఉద్వేగాలను ఆహ్లాదంగా ఉంచుకోవాలి. సానుకూలంగా ఆలోచించాలి.

మానసిక వత్తిడికి దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి కృషిచెయ్యాలి. అప్పుడు తప్పక మీరు మరల ఆరోగ్యంగా తయారవుతారు. అనుమానం లేదు.

ఆనందమే ఆరోగ్యానికి మూలం. బాధలే అనారోగ్యానికి దారితీస్తాయి. ఇదంతా పరిశోధనలవల్ల తెలిసిన సమాచారం. అందువల్ల మానసికంగా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు వైద్యుల వైద్యం కూడా మీమీద చక్కగా పనిచేస్తుంది.

మనస్సు ఎప్పుడైతే బాధల్లో కూరుకుపోతుందో, అప్పుడే అనారోగ్యం మొదల వుతుంది చాలావరకు. బాధలు, వత్తిడివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అందువల్ల కోరికలను అదుపు లోకి ఉంచుకొని, సంతృప్తి అయిన జీవితం కొనసాగించాలి.

అప్పుడు శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కుంగుబాటు, వత్తిడి ఎంతో ఆనర్ధదాయికం. సానుకూల దృక్పథం తప్పక అలవర్చుకో.

ప్రశాంతత అనేది అవసరం. కోర్కెకాదు. దినచర్య ఎంతో ఆనందదాయకంగా ఉండాలి.

వర్తమానంలో జీవించాలి. భవిష్యత్‌ గురించి ఆందోళన వద్దు. గతం గురించి భయంవద్దు.

ఎల్లప్పుడూ ఉద్వేగాలు ఆనందంగా ఉండాలి.

మేడవ్‌, నా వయస్సు 42 సంవత్సరాలు. ఇద్దరు అమ్మాయిలు. నాకు ఈ మధ్యనే గైనిక్‌ ప్రాబ్లం వచ్చింది. రక్తం ఎక్కువగా పోతోంది. దానివల్ల నొప్పి కూడా వస్తోంది. డాక్టరుకి చూపించాము. సమస్య ఏమీలేదని చెప్పారు. అయినా భయంగా ఉంది. చాలా వత్తిడిలో ఉన్నాను. ఏమి జరుగుతుందో అని భయం, ఆందోళన కలుగుతోంది. కాన్సర్‌ ఉందేమో అని భయం, కుంగుబాటు. ఏంచేస్తే నేను మరల మామూలుగా అవగలనోకొంచెం విరించండి మేడమ్‌. ప్లీజ్‌.
– లక్ష్మీ, హైద్రాబాద్‌

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయట పడ గలరు. ఆరోగ్యంగా ఉండగలరు ఋతుక్రమం అనేది సాధారణమైనస్థితి. అందువల్ల దాని గురించి ఆందోళన వద్దు.

కానీ మాన సిక ఉల్లాసం తో అన్నీ బాగయి పోతాయి. రాగద్వే షాలకు దూరంగా ఉండాలి. ప్రేమతో మెలగాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. గౌరవించుకోవాలి.మీపై మీరు శ్రద్ధ వహించాలి.

సరియైన ఆహారం విశ్రాంతి, నిద్ర అవసరం, దైనందిన దినచర్య ఆనందంగా మలచుకోవాలి. వత్తిడి నీ దరిచేరనీయవద్దు. అప్పుడు మీ ఆరోగ్యం బాగయిపోతుంది.

అందులో అనుమానం లేదు. అన్నంటికీ కారణం వత్తడి. అందువల్ల మానసిక ప్రశాంతత చాలా అవసరం. సంతృప్తి అవసరం. భవిష్యత్‌ గురించి ఆందోళ నవద్దు. ఎవరినీ ద్వేషించ కూడదు.

అందరితో స్నేహం గా ఉండాలి. కుటుంబ వాతావరణం ఆహ్లా దంగా మలచు కోవాలి. కటుంబ సభ్యులు ప్రేమాభిమానాలు పంచుకోవాలి.

మానసికంగా ఆరోగ్యంగా ఉంటే, శారీరక ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. మంచి పుస్తకాలు చదవవచ్చు.

మంచి హాబీలతో మంచి కాలక్షేపం చేయ వచ్చు. మీకు ఆనందాన్నిచ్చే పనులు మాత్రమే చేసుకోవాలి. ఒత్తిడి కలిగించే పనులు చేయవద్దు.అత్యాశ పనికిరాదు. ఆత్మగౌరవం ఎంతో అవసరం.

-డాక్టర్‌ ఎం.శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/