ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇబ్బందులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మా కాలేజీల్లో చదువ్ఞతున్న బిసి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచ రంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాల ఉద్దేశ్యపూర్వక అలసత్వం కేవలం విద్యార్థుల్లోనే కాదు యావత్‌ అన్ని వ్యవస్థలో ఉంది. రాజకీయ, ఆర్థిక సామా జికరంగా బిసిలను ప్రభుత్వాలు దెబ్బకొడుతూనే వస్తున్నాయి. ఉన్నత విద్య చదువ్ఞతున్న బిసిలు రీయింబర్స్‌మెంట్‌ పొందలేక పోతున్నారు. తెలంగాణా ప్రభుత్వం ఉన్నత విద్య ఫీజుల బకా యిలు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేక తంటాలు పడుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో 287 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉండగా, ఒక్కో కాలేజీలో కనిష్టంగా 150 మంది, గరిష్టంగా 500 మంది బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. సగటున 250 మంది పనిచేస్తున్నప్పటికీ మొత్తం మీద దాదాపు 70వేల మంది వరకు సిబ్బంది ఉంటారని తెలం గాణ ఉన్నత విద్యావిభాగ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

ఆయా కాలేజీలకు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాకపోవడంతో వీరికి నెలవారీ జీతాలను నిలిపివేశారు. దీంతో వీరంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. దాంతోపాటు, వారంతా ఇంటి అద్దెలు చెల్లించే పరిస్థితి లేక, కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ, లా, బిఈడి, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు రూ. 3400కోట్లకు చేరుకున్నాయి. దీనిలో 2018-19 విద్యాసంవత్సరంలోని బకాయిలు రూ. 1224 కోట్లు కాగా, 2019-20 బకాయిలు దాదాపు 2,176 కోట్లవరకు ఉన్నా యి. గత ప్రభుత్వం 2018-19 విద్యాసంవత్సరానికి మొదటి క్వార్టర్‌ ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌ చేసింది. సాధారణ ఎన్నికలకు ముందు రెండో క్వార్టర్‌కు సంబంధించి గత జనవరిలో సుమారు రూ. 250 కోట్ల వరకుచెల్లించేందుకు సిద్ధమైంది.

సిఎఫ్‌ఎంఎస్‌ నుంచి సకాలంలో బిల్లులు క్లియరెన్స్‌ కాకపోవడంతో విడుదల కాలేదు. ఇక జగన్‌ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల తర్వాత గత ప్రభుత్వం తాలూకు బిల్లులను క్లియర్‌ చేశారు. అయితే ఒక్కో ప్రాంతంలోని కాలేజీలకు ఒక్కో విధంగా ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం మారడంతో రీయింబర్స్‌మెంట్‌ ప్రాధాన్యతలు మారి పోయాయి. ప్రొఫెషనల్‌ కాలేజీలకు ప్రభుత్వం రీయింబర్స్‌ చేయా ల్సిన ట్యూషన్‌ ఫీజు బకాయిలు పేరుకుపోయాయి. 2019-20, 2020-21, 2021-22లకు సంబంధించి గత ఎఎఫ్‌ఆర్‌సి అన్ని ప్రొఫెషనల్‌ కాలేజీలు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించింది. కానీ ప్రభుత్వం గత ఎఎఫ్‌ఆర్‌సి సిఫారసులను పెండింగ్‌ పెట్టిం ది. ఉన్నత విద్యలో సంస్కరణలు, ఉన్నత విద్య రెగ్యులేటరీ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసి ట్యూషన్‌ ఫీజులను నిర్ధారిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత రెగ్యులేటరీ కమి షన్‌ను ఏర్పాటు చేస్తూ చట్టం చేసింది.

కానీ పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. దీంతో బిసిలు తీవ్రంగా ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఇప్పట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేలా లేదు. తాజాగా కాలేజీల్లో ఆకస్మికంగా ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు ట్యూషన్‌ ఫీజులు నిర్ధారిం చేందుకు మరింత సమయం పట్టే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో కొత్త ఫీజులు తేలే లోపు పాత బకాయిలను విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ప్రతి మూడు నెలలకోసారి ట్యూషన్‌ ఫీజులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

సకాలంలో రీయింబర్స్‌మెంట్‌ చేయని ఫలితంగా సింహభాగం కాలేజీలు తమ ఫ్యాకల్టీకి, సిబ్బందికి గత ఐదారు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. ఫీజు రీయింబర్స్‌ కానందునే సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఇంజినీరింగ్‌ కాలేజీల అసోసియేషన్‌ చెబుతోంది. కాలేజీలు, సిబ్బంది, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని అసోసియేషన్‌ కోరుతుంది.కానీ ప్రస్తుత విద్యాసంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుంది. ఇప్పటివరకు ఫీజు రీయింబ్స్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గత 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించే ఇంకా రూ. 1600 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. రెండు సంవత్సరాలకు కలిపి రూ. 4000 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. ఫీజు బకాయిలపై పెద్దఎత్తున గందరగోళం చెలరేగినప్పుడు నెలకు రూ. 200 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కాని దానిని అమలు చేయడం లేదు. అది కూడా ఆరేడు నెలలకు ఓసారి చొప్పున అప్పుడప్పుడూ నిధులు ఇస్తోంది. చివరిసారిగా గత ఏడాది నవంబరులో రూ.200 కోట్లు విడుదల చేసింది. దాంతో కాలేజీలు విలవిలలాడుతున్నాయి. బకాయిలు సకాలంలో రాకపోవడంతో మూడేళ్లలో ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోనే 16 ఇంజినీరింగ్‌ కాలేజీలు మూతపడ్డాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 13 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉంటే వాటిలో ఏడు ఈ ఏడాదిలోనే మూతపడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు కాలేజీలకు కలిపిరూ. 10 కోట్లు చెల్లించాలి. చేవెళ్లలోని 8 కాలేజీలకు రూ. 26.60 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పెద్దపల్లిలోని రెండు ఇంజినీరింగ్‌ కాలేజీలకు రూ. 4 కోట్ల బకాయిలున్నాయి. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోతే కాలేజీలు ఎలా నిర్వహించాలి? జీతాలు ఎలా ఇవ్వాలి? బిల్లులు ఎలా కట్టాలి? కోట్లలో బకాయిలు కారణంగా వందల్లో బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. బకాయిలు రాకపోవడంతో కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నాయి. కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ముందుగా ఫీజు బకాయిలు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కోల్పోయిన బిసిలు నేడు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

మన్నారం నాగరాజు
(రచయిత: రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ లోక్‌సత్తాపార్టీ)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/