‘హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో సైడ్ ఎఫెక్ట్స్’

అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) హెచ్చరిక

hydroxychloroquine
hydroxychloroquine

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ చికిత్స లో పలు దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ ను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రమాదకారి అని… దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) హెచ్చరించింది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే వీటిని పొందుపరిచారని చెప్పింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని చికిత్స అందించాలని సూచించింది. కరోనా బాధితుడి పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలనే విషయాన్ని అక్కడున్న వైద్య సిబ్బంది జాగ్రత్తగా నిర్ణయించాలని తెలిపింది. కాగా మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా చికిత్సకు మంచి ఫలితాలను ఇస్తుందనే భావనతో ఈ డ్రగ్‌ను వాడుతున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/