వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ కీలకం

ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ధాన్యాన్ని తెలంగాణ అన్నదాతలు దేశానికి అందిస్తున్నారు…

Raythu
Raythu

హైదరాబాద్‌: ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ధాన్యాన్ని తెలంగాణ అన్నదాతలు దేశానికి అందిస్తున్నరు.. యాసంగిలో పండించిన పంటనంతా భారత ఆహార సంస్థకు అప్పగించారు.. ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. యాసంగిలో పండిన వరి ధాన్యం సేకరణలో జాతీయస్థాయిలో తెలంగాణది కీలక భాగస్వామ్యమని అన్నారు. 2020 యాసంగిలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 83.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. అందులో తెలంగాణ వాటా 52.23 లక్షల టన్నులు (63 శాతం) అని తెలిపారు. ఎఫ్‌సీఐ లక్ష్యం 91.07 లక్షల టన్నులు కాగా అందులో 57 శాతానికి పైగా తెలంగాణదే అని కొనియాడారు.లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐ 13 లక్షల టన్నుల బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించిందని తెలిపారు. 495 గూడ్స్‌ రైళ్లలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలకు తరలించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించామని, గతంలో ఎప్పుడూ ఇంతటి భారీ స్థాయిలో తరలింపు జరగలేదని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/