అమ్మానాన్నలే ప్రోత్సహించాలి

Parents should be encouraged

మగపిల్లాడు కంటే ఆడపిల్లే నయం అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఏదైనా అనుభవంలోకి వస్తే తప్ప దాని విలువ తెలియదు. వంశోద్దారకుడు కావాలని, అబ్బాయే కావాలని, కంటే బాబునే కనాలనే భావన క్రమంగా తగ్గుతోంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్నారు. అన్నింట్లో వారే టాప్‌గా దూసుకెళ్తున్నారు. అబ్బాయిలతో పోటీగా అన్నిరంగాల్లో ప్రవేశించి, వృద్ధి చెందుతున్నారు.

మహిళలు ఏరంగంలోనైనా తమకు సాధ్యమేనని నిరూపిస్తున్నారు. నింగీనేలా తమదేనంటున్నారు. యుద్ధవిమానాలను నడపడం దగ్గర నుంచి, సైన్యంలో ఉన్నతమైన పదవ్ఞలను అధిరోహించడం, అంతరిక్ష్యంలోకి ప్రవేశించి, తమ సత్తాను చాటుతున్నారు. అక్షరాస్యత శాతాన్ని పెంచుకుంటున్నారు. భావితరాల వారికి నేటి సమాజానికి ఆదర్శంగా కనిపిస్తున్నది. ఆర్థికంగా స్వయం ఉపాధి మార్గాలనే అన్వేషించుకుని, తమకాళ్లపై తాము నిలబడడం మాత్రమే కాదు కుటుంబాలను ఆసరాగా నిలబడుతున్నారు.

మహిళా మండలి ద్వారా సహకార ఆర్థిక సంస్థ ద్వారా గ్రూపులకు బ్యాంకుల ద్వారా పొదుపు లక్ష్మి గ్రూపులు బుణాలను, పొంది కుటీర పరిశ్రమలకు సహాయపడుతున్నారు. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు, నమ్మకం, విధేయత, స్త్రీ ఉద్యోగులలో ఎక్కువని బుజువ్ఞ చేసుకున్నారు.అంతర్జాతీయ ప్రముఖులైన మహిళలు ఎందరో ఉన్నారు. వివిధ రంగాలలో సాధించిన విజయాలు అత్యుత్తమమైనవి. మానవతా దృక్పథంతో నిరంతర సేవా భావంతో తమ జీవితాన్ని అంకితం చేసిన విశ్వమాతృ మూర్తులూ ఉన్నారు.

”మదర్‌ అన్న మాట అనుకోగానే అప్రయత్నంగా మన మదిలో మెదిలే రెండో పథం ”థెరిసా. ప్రపంచానికే తల్లి ఆ పవిత్రమూర్తి. ఎందరినో ఓదార్చి హృదయానికి హత్తుకుని ఆమె పంచిన ప్రేమను పోల్చి చూపించటానికి తగిన స్వరూపము ఏదీ సృష్టిలో లేదు. ఆమెను గౌరవిం చని దేశం లేదు. మనలో నిద్రాణంగా ఉన్న శక్తులను బయటకు తీసి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని ఒత్తిడి లేని ఆనందకరమైన జీవితాన్ని మానసిక పరిణతి, అవగాహన, లక్ష్యసాధన స్త్రీశక్తికి అదనపు ఆయుధాలు. స్త్రీ అనుబంధాల కోసం ప్రాకులాడుతుంది.

స్త్రీ ఇతరుల మీద, ఆధారపడకుండా చెప్పలేనంత ఆత్మవిశ్వాసాన్ని కల్పి స్తుంది. మహిళల వైశిష్ట్యాన్ని తమ సంతతికి వివరించి బాలికలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/