హాజీపూర్ నిందితుడికి ఉరిశిక్ష పడేనా?
నేడు హాజీపూర్ మూడు హత్యల కేసులో తీర్పు

నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్యోదంతం తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధించాలని బాధితుల తల్లిదండ్రులు, హాజీపూర్ గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఈ రోజు తీర్పు వెలువడనున్న తరుణంలో అతడికి ఎలాంటి శిక్ష విధిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వేర్వేరు సందర్భాల్లో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డిపై గతేడాది జులై 31న ఛార్జీషీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతడే ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కూడా తేలింది. అంతేకాకుండా ఫోరెన్సిక్ రిపోర్టు, నిందితుడి మొబైల్‌లో ఉన్న మెసేజ్‌లు, వీడియోలు ఆదారంగా కూడా శ్రీనివాస్‌రెడ్డి ఈ దారుణాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. అయితే ఆధారలు బలంగా ఉన్నప్పుడు, కోర్టులు కూడా స్పష్టమైన తీర్పును ఇస్తాయి. మరోవపై గతంలో శ్రీనివాస్ చెప్పిన మాటలన్నీ అబద్ధమని కోర్టు తేల్చింది కూడా. అందువల్ల కోర్టు అతనికి ఉరిశిక్ష విధిస్తుందా? లేదా? అన్నదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వేచి చూడాలి మరి హాజీపూర్ కేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారనేది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/