ముక్కు పుడకల అలంకరణ..

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

Nose Rings

పెళ్లయిన మహిళలే కాదు టీనేజర్లు మొదలు ఏ వయసువాళ్లైనా ముక్కు పుడకలు అలంకరంచు కోవచ్చు. ఇదే లేటెస్ట్‌ట్రెండ్‌. కాబట్టి సౌకర్యవంతంగా సౌందర్యంగా ఉండే ముక్కెరలను ఎంచుకోండి!

ముక్కుకు శోభ:

ముక్కుకు రంధ్రం వేయించుకుంటే ఖాళీగా వదలకుండా ఎప్పుడూ ముక్కు పుడక పెట్టుకోవాల్సిందే! ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని రంధ్రం వేయించుకుని ముక్కు పుడక పెట్టుకోవాలా?, లేదంటే ముక్కు తమ్మెకు ప్రెస్‌ చేసుకునే వాటిని ఎంచుకోవాలా? అనేది నిర్ణయించుకోవాలి.

ఇప్పుడు మార్కెట్లో ఈ రెండు రకాల ముక్కు పుడకలు దొరుకుతున్నాయి. వీటిలో ప్లాటినమ్‌ అయితే ఒంటి వజ్రంతో ఉన్నవి టీనేజర్లకు సూటవుతాయి. ఎలాంటి నగా లేకపోయినా, ఎంత ఆధునికంగా ఉన్నా, ఇలాంటి ముక్కు పుడక వాళ్ల స్టయిల్‌ను దెబ్బతీయదు.

ఒకవేళ సంప్రదాయంగా కనిపించడానికి ఇష్టపడేవాళ్తైతే 2 నుంచి 3 గ్రాముల్లో రాళ్లు పొదిగినవి, వేలాడే మువ్వలు ఉండే ముక్కు పుడకలు ఎంచుకోవచ్చు. ముత్వాలు పొదిగిన ముక్కు పుడకలు కూడా అందంగానే ఉంటాయి. ముక్కు లోపలి నుంచి బిగించుకునేవైతే దాన్ని బిగించుకునే వీలును పరీక్షించుకోవాలి.

ఏవి మేలు ?

మరీ పెద్ద ముక్కు పుడకలు కొంటే తరచుగా పెట్టుకోవడానికి పనికి రావు కాబట్టి ధరించడానికి వీలుండే వాటినే ఎంచుకోవాలి.

పువ్వులు, లతల డిజైన్లు ఉండే ముక్కు పుడకలు వేడుకల్లో ధరించడానికి బాగుంటాయి. మోడర్న్‌గా కనిపించాలనుకుంటే రోజ్‌ గోల్డ్‌లో వజ్రాలు పొదిగిన ముక్కు పుడకలు ఎంచుకోవాలి.

జాతి రాళ్లు ఇష్టపడేవాళ్లు కెంపులకే ప్రాధాన్యం ఇవ్వాలి. టీనేజీ అమ్మాయిలు లేదా 10 నుంచి 14 ఏళ్ల ఆడప్లిలు వేడుకల్లో ముక్కుపుడకకు చెంపస్వరాలు తగిలిం చుకోవచ్చు. అయితే ఈ అలంకరణ, దుస్తులతో మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/