ఫ్యాషన్‌ జ్యూయెలరీ

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

fashion jewellery
fashion jewellery

ఏ చిన్న వేడుకైనా మగువలు పట్టుచీర ధరించడం వైపే మొగ్గుచూపుతారు. దాని మీదకు సంప్రదాయ బంగారు ఆభరణాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పట్టుచీర మీదకు ధరించడానికి రకరకాల ఫ్యాషన్‌ జ్యుయెలరీ అందుబాటులోకి వచ్చింది. ఇండోవెస్ట్రన్‌, వెస్ట్రన్‌ డ్రెస్సులకు నప్పే ఈ ఆభరణాలు చీరకట్టు మీదకు ఇప్పుడు ఒద్దికగా ఒదిగాపోతున్నాయి.

సంప్రదాయ చీరకట్టుఅయినా ఈ రోజులకు తగినట్టుగా ట్రెండీగా కనడాలనేది యువతుల ఆలోచన. వీటిలో ఫ్యాషన్‌ జువెల్రీలో భాగమైన సిల్వర్‌, కుందన్‌, పూసలు, రత్నాలతో చేసిన వెస్ట్రన్‌ డిజైన్‌వేర్‌ బాగా నప్పుతుంది. వీటిలో పొడవాటి హారాలు, మెడను చుట్టేసే చోకర్స్‌ ఉంటున్నాయి.
ఫ్యాషన్‌ జువెల్రీలో చెప్పుకోదగినది థ్రెడ్‌ జువెల్రీ.

ఇది రకరకాల డిజైన్లలో రంగులలో పట్టు చీరల మీద కొత్తగా మెరు స్తోంది. ఈ ఆభరణాల్లో చీర అంచులు, ప్రింట్ల రంగులను తీసుకొని డిజైన్లు సృషిస్తున్నారు. ఈ ఆభరణాల్లో చీర అంచులు, ప్రింట్ల రంగులను తీసుకొని డిజైన్లు సృష్టిస్తున్నారు. ప్లెయిస్‌ పట్టుచీర అయితే, దాని మీదకు కాంట్రాస్ట్‌ లేదా మ్యాచింగ్‌ కలర్‌ థ్రెడ్‌ వెల్రీ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది.

థ్రెడ్‌ జువెల్రీతో పాటు చెప్పుకోదగినది టెర్రకోట ఆభరణాలు. ఈడిజైన్స్‌స్‌ంప్రదాయపు సొబగులు అద్దడంలో
సరైన పాత్ర పోషిస్తున్నాయి. సంప్రదాయ పట్టుకు ఈ తరహా ఆభరణాలే ధరించాలనే నిమయాలేవీ లేవు. ఫ్యాషన్‌ జువెల్రీతో లుక్‌లో కొత్త మార్పులు తీసుకోవచ్చు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/