రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ..
తూళ్లురు నుంచి మందడం వరకు భారీ ఎత్తున వాహన ర్యాలీ చేపట్టిన రైతులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. ఈ మేరకు తుళ్లూరు నుంచి మందడం వరకు భారీ ఎత్తున వాహన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతుకూళీలు, మహిళలు పాల్గొన్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లతో వేలాదిగా జనం ఈ ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేవ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని పరిధిలో 29 గ్రామాల గుండా ప్రదర్శన కొనసాగనుంది. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు రైతులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/