ఈ 8న ఏపిలో రైతు దినోత్సవం

అమరావతి: ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఏపి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమం కడప జిల్లాలోని జమ్మలమడుగులో నిర్వహిస్తారని సియం జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు రైతు దినోత్సవం నిర్వహిసారని చెప్పారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి సియం శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/