నెల్లూరులో ‘ఫణి’ తీవ్రతరం

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఫణి తుఫాను ప్రభావం తీవ్రతరం అయింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. సముద్రం 15 మీటర్ల మేర ముందుకు వచ్చింది. సముద్రంలో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. పలు చోట్ల తీర ప్రాంతం కోతకు గురైంది. జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/