పవన్ కోసం పెద్ద సాహసం చేసిన వీరాభిమాని..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్క హీరోకు తమకంటూ అభిమానులుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం హీరోలే అభిమానులుగా ఉంటారు. పవన్ నుండి సినిమా వస్తుందంటే చాలు వారి సినిమా రిలీజ్ అన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక అభిమానులైతే వారం ముందు నుండే పండగ వాతావరణం తీసుకొస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ కోసం ఓ కన్నడ అభిమాని పెద్ద సాహసం చేసి మెగా అభిమానులను , హీరోలను ఆకట్టుకున్నాడు.

పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్ట పడే కర్ణాటక బళ్లారికి చెందిన లాలా కమాన్ నివాసి బి. చంద్ర శేఖర.. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఏకంగా 400 కిమీ పాదయాత్ర చేపట్టాడు. గత సోమవారం ఈ యాత్ర చేపట్టిన అతడు.. ఆదివారం హైదరాబాద్​లోని షాద్​నగర్​ చేరుకున్నాడు. కొన్నేళ్లుగా పవన్​ కల్యాణ్​ను కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రశేఖర తెలిపారు. అయితే ఎప్పుడూ కలవలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. బళ్లారి నుంచి హైదరాబాద్​కు పాత్రయాత్ర చేపట్టడం ద్వారా పవన్​ను కలవడం ఎంతో ప్రత్యేకమని అన్నాడు. మరి పవర్​స్టార్​ను కలవాలనే అతడి కల ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి. ప్రస్తుతం దీనిని అభిమానులు సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తున్నారు.