మెల్బోర్న్ వేడుకలకు ముఖ్య అతిథిగా కరణ్ జోహార్

ఆస్ట్రేలియాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

Karan Johar to hoist Indian flag in Melbourne
Karan Johar to hoist Indian flag in Melbourne

ముంబయి:ఆగస్టు 8 నుంచి 17 వరకు జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్(ఐఏఫ్ఏఫ్ఏమ్) 2019 వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వెళ్తున్న బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆస్ట్రేలియాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 11వ తేదీన జాతీయ జెండాను ఎగురవేయబోతున్నాడు. ఈ సందర్భంగా బహుళ సాంస్కృతిక నగరాల్లో ఒకటైన మెల్బోర్న్‌లో జరిగే ఈ వేడుకల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కరణ్ తెలిపాడు. ఈ ఏడాది తనకు దక్కిన ఈ గౌరవం పట్ల తాను ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తిరంగాను ఆవిష్కరించే అవకాశం దక్కడం నిజంగా చాలా పెద్ద గౌరవం అన్నాడు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/