ఇంట్లో ఉంటె ఎక్కడ చనిపోతామని..గుడిలోకి వెళ్తే

ఏపీని భారీ వర్షాలు భయబ్రాంతులకు గురిచేశాయి. చుక్క నీరు దొరకని రాయలసీమ లో అతి భారీ వర్షాలు పడడమే కాదు భారీ వరదలు మొచ్చేత్తాయి. ఈ భారీ వర్షాలకు వేలాది ఎకరాలు నీటమునగా..ఎన్నో ఇల్లులు వరదలకు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటె కడప జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. ఇంట్లో ఉంటె ఎక్కడ వరదలకు కొట్టుకపోతామో అని ..ఆ ఇంట్లో వారంతా గుడిలోకి వెళ్లి తలదాచుకోవాలని అనుకున్నారు. ఆ నిర్ణయమే వారిని అనంతలోకానికి తీసుకెళ్లింది.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని మందపల్లిలో రామ్మూర్తి కుటుంబం నివసిస్తుంది. మొత్తం ముగ్గురు కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లతో ఆ కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కసారిగా గ్రామంలోకి వరద రావడంతో కుమారులు, కోడళ్లు కలసి ఆలయం లోకి వెళ్లి తలదాచుకుందామని భావించారు. కానీ వరద ఆలయాన్ని చుట్టుముట్టింది. ఇంట్లో ఉన్న వాళ్లు బతికిపోయారు. అక్కడకు వెళ్లిన వాళ్లు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం బోరున విలపిస్తుంది. ఇంట్లో ఉన్నా బతికేవారని వారు రోదిస్తున్నారు. వారి ఆవేదన అక్కడి వారిని కన్నీరు పెట్టిస్తుంది.