కుటుంబ నియమాలు అవసరం!

జీవన విధానం

ప్రతి కుటుంబానికి కొన్ని నియమాలు ఉండాలని అంటున్నారు నిపుణులు.. వీటిని అందరూ పాటించేలా అలవాటు చేసుకుంటే , పెద్దవాళ్ళు మాత్రమే కాదు . పిల్లలకు క్రమశిక్షణ అలవడుతుంది.. కుటుంబ విలువలను నేర్చుకుని పాటించటం మొదలు పెడతారు..

Family rules are essential


కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు నిద్ర లేచిన వెంటనే పక్క దుప్పట్లు మడత పెట్టకుండానే పడక గది నుంచి బయటకు వస్తారు… వారిని పిల్లలు అనుసరిస్తారు. ఆ తర్వాత వీటిని యధావిధిగా సర్దటానికి ఆ ఇంటి ఇల్లాలికి మరో 10 నిముషాలు కావాల్సి వస్తుంది… మరికొందరు ఉదయం నేర్చుకుంటారు.. ఇది పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది.. అందుకే ప్రతి కుటుంబానికి కొన్ని నియమాలుండాలి. వాటిని అందరూ పాటించటానికి ప్రయత్నిస్తారు

వీటిని అలవాటు చేసుకోవాలి..

నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు మడిసి బెడ్ సర్దాలి. ఉదయాన్నే కాల కృత్యాలు తప్పనిసరి.. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలి. గట్టిగా అరిచి మాట్లాడటం , గొడవలు పెట్టుకోవటం వంటివి వుండకూడదు.. భోజనం అందరూ కలిసి చేయాలి.. ఒకరికొకరు సాయం చేసుకోవాలి.. బెడ్ పై ఆహారాన్ని తీసుకోకూడదు… ఫోన్, లాప్ టాప్ వంటి వాటిని రాత్రి 9 తర్వాత చోడటానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి.. పెద్దవాళ్లు చెప్పే ఆలోచన, సలహాలను చిన్న వాళ్లు వినాలి.. పిల్లలకు తల్లి దండ్రులు సమయాన్ని కేటాయించాలి. అందరూ తీసిన వస్తువు తీసిన చోట పెట్టాలి.. వీలైనంత వరకు ఎవరి పనులు వాళ్ళు సొంతంగా చేసుకోవటానికి ప్రయత్నించాలి… ఈ నియమాలను ముందు గదిలో చార్ట్ గా తయారు చేసి అంటించండి.. ఇంటిల్లిపాదీ వీటిని కఠినంగా కాకుండా అందరూ సమానంగా , ఇష్టంగా అమలు చేసేలా చూస్తే చాలు.. మార్పు సాధ్యమే..

చిన్నారులకు సంబంధించి మరిన్ని విషయాల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/kids/