క‌ర్నూలులో విషాద ఘ‌ట‌న

విషం తాగి ఒకే కుటుంబంలో న‌లుగురి ఆత్మ‌హ‌త్య‌

కర్నూలు: క‌ర్నూలులో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. విషం తాగి ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కర్నూలుకు చెందిన ప్రతాప్‌, హేమలత దంపతులు. వారికి కుమారుడు జయంత్‌, కూతురు రిషిత ఉన్నారు. ప్రతాప్‌ టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, మంగళవారం రాత్రి నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఉదయం ఇంట్లోనుంచి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సన్నిహితులు, బంధువులు మరణించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/