పిల్లల నుంచి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి

కుటుంబం సంగతులు

Family-Children
There is so much to learn from children

పిల్లలే మనకు మార్గదర్శకాలు.. పిల్లలు తల్లిదండ్రులను చూసే అన్ని విషయాలు నేర్చుకుంటారు. కానీ మనం కూడా వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. వారిలో ఉండే అమాయకత్వం, కల్మషం లేని నవ్వు ప్రతిదీ మనకు నిత్య జీవిత పాఠమే!

పరిచయం లేని వ్యక్తులను చూసిన సరే కల్మషం లేకుండా నవ్వేస్తారు. అలాంటి స్పందనే ఎదుటి వాళ్ల నుంచి వస్తుంది. అంతేగానీ, నవ్వే ముందు ఎందుకు నవ్వాలి అనే ప్రశ్న వాళ్లకుండదు. ఇది మనకు వర్తిస్తుంది.

మన ఇంటిపనికో, బస్సులో పక్కసీటు లోనో, ఉద్యోగంలోనో, కొత్త వాళ్లతోనో మాట్లాడాలా వద్దా మాట్లాడితే ఏమనుకుంటారో, ఎలా పకరరించాలి.

ఇలా సవాలక్ష ప్రశ్నలు వేసుకోకుండా ఒక సారి నవ్వేస్తే చాలు. స్నేహం మొదలవు తుంది. పిల్లలకు ఒక వస్తువునో, జంతువునో చూస్తే భయపడాలన్న విష యం మనం చెప్పే దాకా తెలీదు.

There is so much to learn from children
There is so much to learn from children

మనమే అది బూచి అం టూ చెప్పి భయ పెడతాం. మనం ఇలా పూర్తిగా దేనికీ భయపడకుండా ఉండాలని కాదు కానీ అన్నింటినీ విపరీతంగా ఆలోచించడం మానుకోవాలి.

వయసు పెరిగే కొద్ది తిరస్కరణాల భయం, ఓటమి లాంటి ఆలోచనలు మెదడులో నాటుకు పో తాయి. వీటిని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించాలి. నవ్వడం, ఆడుకోవడం, పాడటం, చిన్నప్పుడు అందరం చేసేవే. కానీ పెద్దయ్యాక మెచ్యూరిటీ పేరుతో అవన్నీ మరిచిపోతాం.

అయితే సమయానికి, సందర్భానికి అనుగుణంగా అలా ఉండటం తప్పుకాదు. కానీ పూర్తిగా మన జీవితం నుంచి వేరు చేయకుండా ప్రతిక్షణం ఆనందంగా గడిపేలా చూసు కోవాలి.

ఒక వయసు రాగానే మనం ప్రశ్నించే తత్వం మరిచిపోతాం. కానీ పిల్లల్లా మన సందేహాలను ఎప్పటి కప్పుడు నివృత్తి చేసుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/