ఆత్మీయతానురాగాల పంట

FAMILY--
FAMILY–

ఆత్మీయతానురాగాల పంట

కుటుంబంలో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు రక్తసంబంధం, సహచరత్వం, ఒకే నివాసం. ఈ లక్షణాలు ఒక్కో సమాజంలో ఒక్కో విధంగా ఉంటాయి. భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకు నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది.

మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి. ఇంటిలోని పెద్దకు అందరు గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండే వంటే ముటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బంధుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవరాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానికి తావు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది.

నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించలేని పరిస్థితి నెలకొంది. నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత.. ఇవేవీ నేటి కుటుంబాలలో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనసులు కూడా ఇరుకు చేసుకొని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలకు చోటెక్కడా కనిపించదు. ఇటువంటి తరుణంలోనే విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సంఖ్యత పెంపొందించాలనే దృఢ సంకల్పంతో వరల్డ్‌ ఫ్యామిడేను నిర్వహిస్తున్నారు. కొన్ని సమాజాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ పిల్లలు అంతగా పెద్దవాళ్లయ్యాకి అంతగా కలిసి ఉండలేకపోన్నారు. అయినా కూడా కుటుంబ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఆచరిస్తున్నారు.

కొన్ని కుటుంబాలు ఎవరికి వారుగా వేరు వేరు చోట్ల ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఒకేచోట కలుస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు జరిగినప్పుడు అంతా ఒకచోట సందడి చేస్తుంటారు. అలా కలిసినపుడు ఎవరికి ఎవరు ఏమవ్ఞతారో చెప్పుకుంటూ సరదాగా ఉంటుంటారు. అందుకే కుటుంబవ్యవస్థలో ఇంతటి ఆప్యాయతలు, అనురాగాలు ఉంటున్నాయి. మనుషుల మధ్యనే గాక మనుసుల మధ్య దూరం ఉండకుండా చేస్తుంది. మరి! మీరు కూడా కుటుంబ వ్యవస్థను, సంప్ర దాయాలను పాటిస్తే మంచిది.