పిల్లలతో కాసేపు

FAMILY-
FAMILY-

పిల్లలతో కాసేపు

పిల్లల్ని పెంచమంటే వారికి సౌకర్యాలన్ని సమకూర్చడమే కాదు, మానసిక, భావోద్వేగపరమైన అవసరాలనూ తీర్చాల్సి ఉంటుందని పెద్దలు అర్ధం చేసుకోవాలి. ఒకప్పటిలా ఉమ్మడి కుటుంబాలూ, కజిన్స్‌తో కలిసిమెలిసి ఉండడాలూ ఇప్పుడు లేవు. అమ్మానాన్నా ఒకరో ఇద్దరో పిల్లలు.. ఇప్పుడిదే కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతే సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు రాత్రి వరకూ ఒంటరిగానే ఉంటున్నారు. అమ్మానాన్నా వచ్చినా ఎవరి పని వారిదే. ఒకరు వంటపనులతో బిజీగా ఉంటే, మరొకరు ఆఫీసు పనితోనే ఫోనుతోనో బిజీగా ఉంటారు.

అందుకే పిల్లలు తమ మాట వినేవారికి కోసం చూస్తుంటారు. పిల్లలు మనసు విప్పి మాట్లాడేందుకు ప్రోత్సహించే అను రాగపూరిత వాతావరణం ఇళ్లల్లో కను మరుగవుతోంది. ఎవరి గదుల్లో వాళ్లు ఉంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో క్వాలిటీ సమయం గడపాలి. రోజూ కాసేపు తప్పనిసరిగా మాట్లాడడమే కాదు, వివిధ అంశాల మీద పిల్లలు తమ అభిప్రాయాలను చెప్పు అవకాశమివ్వాలి. అప్పుడే వాళ్ల ఆలోచనలు తెలుస్తాయి.

వారిని సరైన మార్గంలో పెట్టడానికి వీలవుతుంది. కుటుంబంలో అనుబంధాలు బలహీన మైనప్పుడు, మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు కరువైనప్పుడు బాధను పంచుకునే బయటి వ్యక్తుల కోసం చూడాల్సి వస్తుంది. ఆ అవసరం అమ్మా నాన్నలున్న చిన్న పిల్లల దాకా రావడమే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఎదిగే వయసులో ఎన్నెన్నో సందేహాలూ, సమస్యలూ ఆ చిన్న మెదళ్లను తొలిచేస్తుంటాయి. ఆ ఉద్వేగాలను ఓపిగ్గా విని మంచీ చెడూ విడమరచగలిగిగే చాలు.