గవర్నర్‌తో హాజీపూర్ ఘటనల బాధిత కుటుంబాల భేటి

మా కుటుంబాలకు తగిన న్యాయం కావాలి

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసైని హాజీపూర్ ఘటనలలో బాధిత కుటుంబాల వారు, బీసీ సంఘం నేతలు కలిశాయి. రాజ్ భవన్ లో ఈరోజు భేటీ అయ్యారు. హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరుతూ ఆమెకు ఓ వినతిపత్రం సమర్పించారు. ముగ్గురు బాలికలను శ్రీనివాస్ రెడ్డి పాశవికంగా హతమార్చిన విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చారు.గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో బాధిత కుటుంబాలు మాట్లాడుతూ, నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. దిశ ఘటనలో నిందితులను ఎలా అయితే హతమార్చారో శ్రీనివాస్ రెడ్డిని కూడా అదేవిధంగా చంపాలని అన్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, హాజీపూర్ వరుస ఘటనల గురించి తనకు తెలుసని తమిళిసై చెప్పారని, బాధిత కుటుంబాల వినతిపై ఆమె సానుకూలంగా స్పందించారని అన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/