రెవెన్యూ లోటుపై తప్పుడు గణాంకాలు

sujana chowdary
sujana chowdary

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఇప్పడినుంచే ఓట్ల రాజకీయం ప్రారంభించారని, అమిత్‌షాకు ఇచ్చిన వినతి పత్రం ఆధారాలులేనిదని, పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అసంతృప్తితో ఉందని బిజెపి ఎంపి సుజనా చౌదరి అన్నారు. జగన్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే రెవెన్యూ లోటుపై తప్పుడు గణాంకాలు చెపుతుందని ఆయన విమర్శించారు. పోలవరం టెండర్ల విషయంలోనూ, ప్రాజెక్టు
పరిణామాలపై కూడా కేంద్ర జలశక్తిశాఖ అసంతృప్తిగా ఉన్నట్లు సుజనా చౌదరి తెలిపారు. అమరావతిలో కేవలం తొమ్మిదివేల కోట్ల పనులు మాత్రమే జరిగాయి, కాని ముపై వేలకోట్లు ఎలా వృధా అయ్యాయని ప్రశ్నించారు.
తాజా జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/