తగ్గుతున్న దిగుమతులు, పెరుగుతున్న ధరలు

భారత్‌, చైనా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం

Falling imports, rising prices
Falling imports, rising prices

భారత్‌, చైనా సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం మేకిన్‌ ఇండియాను పటిష్టపరిచే విధానంలో భాగం ఏదైనా కావొచ్చు. రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏమాత్రం నమ్మదగిన విధంగా లేని చైనా వైఖరితో విసిగిపోయిన భారత ప్రభుత్వం చైనాను దూరం పెట్టడానికే సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆ రకమైన నిర్ణయాలనూ తీసుకుంటోంది.

ఇందులో భాగంగానే చైనా దిగుమతులను తగ్గించుకుంటోంది. ఫలితంగా గడిచిన ఆరు నెలల్లో ఒక ఎలక్ట్రికల్‌ రంగంలోనే భారత్‌లో డిమాండ్‌కు తగ్గట్టు స్వదేశీ కంపెనీల నుంచి సప్ల§్‌ు లేక విపరీతమైన ధరలు పెరిగాయి.

ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిజ్‌లు, ప్రింటర్లు, ఇలా అన్ని రకాల ఎలక్ట్రికల్‌ వస్తువ్ఞల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.అయితే భారత్‌ తాజా వైఖరికి అనుగుణంగా ఇప్పటికిప్పుడు మనం చైనాతో వాణిజ్య సంబంధాలు తెంచేసుకోవడం అంత ఈజీకాదు. దాని వలన మనకు ప్రత్యక్షంగా నష్టభయమే ఎక్కువ కన్పిస్తున్నట్టు తాజా పరిశీలనలో తేలిపోయింది. దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది.

చైనా ఇటీవల కాలంలో సరిహద్దుల్లో మనదేశాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం నిజమే. మాటలకూ, చేతలకూ అసలు పొంతనలేని ఆ దేశ వైఖరిపై మనమంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయమూ వాస్తవమే. కానీ ఇప్పటికిప్పుడు చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచేసుకోవడం అంత సులభం అయ్యేపనికాదు.

ఎందుకంటే దిగుమతులు, ఎగుమతుల పరంగా చైనాతో పరస్పర సంబంధాలు నెలకొల్పడానికి మనం దశాబ్దాల సమయం పట్టింది. చైనా నుంచి దిగుమతులు మాత్రమే కాదు. ఎగుమతులు సైతం గణనీయంగా చేసుకుంటున్నాం. ఇండో, చైనా దేశాల మధ్య వాణిజ్యాన్ని చూస్తే భారత్‌ కంటే చైనాకే ఎక్కువ లాభం కలుగుతోంది. గతేడాది రెండు దేశాల మధ్య 87 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వ్యాపారం జరిగింది.

ఇందులో 70.3 బిలియన్‌ డాలర్లను వస్తు, సేవల రూపంలో భారత్‌కు దిగుమతులు జరగ్గా 16.75 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు మాత్రమే భారత్‌ చేయగలి గింది. అంటే 53.55 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటుతో ఉంది భారత్‌. చైనా నుంచి వందశాతం దిగుమతులు ఉండగా భారత దేశం నుంచి ఎగుమతులు మాత్రం పావ్ఞ వంతు జరుగుతున్నా యి. భారత్‌కు 2013-14 నుంచి అతిపెద్ద వాణిజ్యభాగస్వామి చైనా మాత్రమే.

2018-19 నుంచి అమెరికా ఆ స్థానాన్ని ఆక్రమించింది. అయితే జూన్‌లో జరిగిన గల్వాన్‌ సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో భారతప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. తక్కువ ధర, నాణ్యత లేని చైనా ఉత్పత్తుల దిగుమతు లను చాలా కీలక విభాగాల్లో ఉండకుండా నిర్ణయాలు తీసుకుంది. దీనికితోడు కరోనా వల్ల చైనా నుంచి సరఫరా నిలిచి, వాణిజ్య పరంగా ఇబ్బందులు పెరగ్గా,గల్వాన్‌ ఘర్షణ తర్వాత అది మరింత దిగజారింది. అందుకే చైనాపై ఆధారపడటం తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇక సరిహద్దుల్లోనూ డ్రాగన్‌ దురాక్రమణ వైఖరికి బుద్ధి చెప్పేందుకు ఎక్కడా తగ్గట్లేదు. ఐదు నెలలుగా విప రీత పరిస్థితులను తట్టుకొని భారతసైన్యం లద్దాక్‌లో నిరంతరా యంగా విధుల్లోనే ఉంది. భారత్‌ మొత్తం ఎలక్ట్రానిక్‌ దిగుమతుల్లో 45 శాతం చైనా నుంచే వస్తున్నాయి. యంత్రాల విడిభాగాలు సహా 40శాతం ఆర్గానిక్‌ కెమికల్స్‌ చైనా నుంచే దిగుమతి చేసు కుంటున్నాం.ఇండియాలో వినియోగించే ఆటోమేటివ్‌ పార్ట్స్‌, రసాయనాల్లో దాదాపు 25 శాతం చైనావే. ఫార్మాలో ఉపయో గించే ముడిసరుకులో 70 శాతం చైనాలోనే ఉత్పత్తి అవ్ఞతున్నా యి. చైనా తెలివైంది. భారత్‌ చైనాకుతక్కువ ధర ఉన్న వస్తు వ్ఞలు, ముడిసరుకును పంపిస్తుంటే చైనా దాన్ని తుది ఉత్పత్తు లుగా మార్చిమళ్లీ మన దేశానికే భారీధరకు అమ్ముతోంది.

ముఖ్యంగా టెలికాం పరికరాలు, కంప్యూటర్‌ హార్ట్‌వేర్‌, ఐటిఉత్పత్తులు, మొబైల్‌ ఫోన్లు, వాటి విడిభాగాలను మనకు అమ్మి బాగా లబ్ధి పొందుతోంది. భారత్‌ వలన చైనా అన్ని విధాలా లాభపడుతోంది. ఆ దేశ కంపెనీలు ప్రతియేటా లక్షల కోట్లు వెనకేసుకుంటున్నాయి అనేదీ వాస్తవమే. టిక్‌టాక్‌తో సహా ఇటీవలికాలంలో చైనాకు సం బంధించి కొన్ని యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించడం తో ఆ సంస్థలకు రూ.80వేల కోట్లకుపైగానే నష్టాలు వచ్చినట్టు వెల్లడైంది. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే చైనా వైఖరితో విసిగిపోయిన సగటు భారతీయుడు ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసుకోవడానికే మొగ్గు చూపుతున్నాడు.

కేంద్రప్రభుత్వం కూడా ఇదే రకమైన అడుగులు వేస్తోంది. కానీ దశాబ్దాల కాలంగా ఎన్నో రంగాల్లో పాతుకుపోయిన ఆ దేశంతో సంబంధాలు తెంచుకున్నా మనకు నష్టం జరగకూడదు అనుకుంటే మాత్రం దీనికి తీవ్ర కసరత్తు జరగాలి. ముఖ్యంగా ప్రభుత్వ విధి విధానాల్లో కొన్ని మార్పులు చేయాలి. దేశీయ తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు సబ్సిడీ వంటి ప్రత్యేకమైన పద్ధతులతో సాయాన్ని అందించాలి.

మేకిన్‌ ఇండియా పాలసీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి. పెద్దఎత్తున నిధులు ఏర్పాటు చేయాలి. అప్పుడే చైనా లేని లోటు నుంచి క్రమ క్రమంగా ఆ మార్పు సాధించవచ్చు. అంతేకానీ తాత్కాలికమైన ఉద్రిక్తతల కోసం ఆ దేశంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం వలన మనకు ఇప్పుడు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు ప్రత్యక్షంగా తెలిసి పోయింది. వాణిజ్య అసమతుల్యతను దిద్దుబాటు చేస్తూనే ఆ దేశాన్ని క్రమక్రమంగా దూరంగా పెట్టినప్పుడే చైనాను మనం విజయవంతంగా ఎదుర్కొన్నట్టు అవ్ఞతుంది.

  • శ్రీనివాస్‌ ముద్దం

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/