చిన్నారులపై కూలిన చెట్టు : ఇద్దరు మృతి

మరికొందరికి గాయాలు

Fallen tree on children: Two killed
Fallen tree on children: Two killed

Khammam: అక్కడ ఓ ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటూ ఉండగా అమాంతంగా ఓ చెట్టు కూలింది. ఇంకేముంది ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ దుర్ఘటన స్థానికుల్లో విషాదం నింపింది. మ‌రో నలుగురు గాయపడ్డారు .. వివరాలు.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ బ‌జారులో మంగ‌ళవారం సాయంత్రం చిన్నారులు ఖాళీ స్థ‌లంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. సమీపంలో ఉన్న భారీ చెట్టు ఒక్క సారిగా కూలింది. ఈ ఘటనలో దిగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6) మృతి చెందారు. గాయపడిన మరో చిన్నారును ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స జరిపారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/