తెరాస నేతలను ఖంగారు పెట్టించిన ఫేక్ ఈడీ నోటీసులు..

తెరాస నేతల ఫోకస్ అంత హుజురాబాద్ ఉప ఎన్నికల ఫైనే ఉండగా..వారిని నకిలీ ఈడీ నోటీసులు షాక్ కు గురి చేసాయి. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు ఈడీ నోటీసులు అందాయి. ఆ నోటీసుల్లో తమ సోదరులను అరెస్ట్ చేస్తామని ఉండడం తో మంత్రితో పాటు తెరాస నేతలు ఖంగారు పడ్డారు. ఈ నోటీసుల ఫై వెంటనే మంత్రి అధికారులను సంప్రదించగా..అవి ఫేక్ నోటీసులను తేల్చారు. దీంతో నకిలీ ఈడి నోటీసుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నోటీసులు అందజేసిన అగంతకులు పై 420,468,471 కింద కేసులు నమోదు చేసారు. మరి ఈ నోటీసులు ఎవరు పంపించారనే దానిపై విచారణ మొదలుపెట్టారు.

ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల విషయానికి వస్తే..నువ్వా..నేనా అనేలా తెరాస , బీజేపీ వార్ నడుస్తుంది. ఎక్కడ కూడా తగ్గిదిలే అని ఇరు పార్టీలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ తెరాస మాత్రం అనేక పథకాలతో హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హుజురాబాద్ నియోజకవర్గానికి భారీగా నిధులు సమకారొస్తున్నారు. మరి ఈ పోరు లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.