చార్మినార్ వద్ద బాంబు బెదిరింపు ఫేక్..

చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి పోలీసులకు ఫోన్ కాల్ రావడం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. ఫోన్ కాల్ రావడం తో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. చార్మినార్ చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాలు, హోటళ్లలో తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

ఆగంతుకులు చేసిన ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది..? చేసింది ఎవరు…? అనే విషయాలు తెలుసుకునే వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు. జన సందోహం ఎక్కువగా ఉండే ప్రదేశం.. అందులోనూ చారిత్మక కట్టడం.. కావటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఫోన్ కాల్ అనేది ఆకతాయిల కాల్ అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. చార్మినార్ కు బాంబు బెదిరింపులు ఇదే కొత్త కాదు. గతంలోనూ ఓసారి ఆకతాయిల కాల్ తో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.