సిఎం పదవికి ఫడ్నవిస్‌ రాజీనామా

devendra fadnavis
devendra fadnavis

ముంబయి: ఎట్టకేలకు మహారాష్ట్ర సిఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనున్న నేపధ్యంలో ఆయన తన రాజీనామ లేఖను గవర్నర్‌కు అందజేశారు. శుక్రవారం బిజెపి సీనియర్‌ మంత్రులతో కలిసి ఫడ్నవిస్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి తన రాజీనామా లేఖను ఇచ్చారు. గవర్నర్‌ తన రాజీనామాను ఆమోదించినట్లు ఫడ్నవిస్‌ తెలిపారు. మిత్ర పక్షాలైన బిజెపి, శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినా, అధికార పీఠం విషయంలో ఇరువర్గాల మధ్య పొరపొచ్చలు తలెత్తిన విషయం తెలిసిందే.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/