శ్వేతసౌధం నుండి ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు అందని ఆహ్వానం!

Facebook, Twitter and Donald Trump
Facebook, Twitter and Donald Trump

వాషింగ్టన్‌: త్వరలో శ్వేత సౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్ని సామాజికి మాధ్యమాల ప్రతినిధులతో ఓ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో అంతర్జాలం వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇందులో కీలక చర్చలు జరగనున్నాయి. అయితే, సామాజిక మాధ్యమాల దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకు శ్వేతసౌధం నుంచి ఆహ్వానం అందలేదు. సామాజిక మాధ్యమాలకు సంబంధించిన సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో దిగ్గజ సంస్థలుగా ఉన్న ఈ రెండింటికి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమని పలు రంగాలకు చెందిన ప్రతినిధులు అంటున్నారు. ఈ విషయంపై స్పందించడానికి శ్వేతసౌధం అంగీకరించలేదు. కాగా గతంలో ట్రంప్‌ తమ రిపబ్లికన్ల భావాలను ఈ రెండు సంస్థలు గౌరవించట్లేవనిపలుసార్లు విమర్శలు గుప్పించారు. ఈ సదస్సు గురువారం జరగనుంది. ఈ సదస్సులో ఏయే సంస్థలు పాల్గొంటున్నాయన్న విషయం తెలియరాలేదు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/