మారనున్నా వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేర్లు

WhatsApp-Instagram-Facebook
WhatsApp-Instagram-Facebook

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌, ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్ నుంచి వచ్చినప్పటికీ వీటికంటూ స్వతంత్రత ఉంది. గత ఏడాది కాలంగా ఫేస్‌బుక్‌ వీటికి ఆ స్వతంత్రతను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ 2012లో ప్రారంభించగా, వాట్సప్‌ 2014లో వినియోగంలోకి వచ్చింది. ఈ రెండింటికీ సొంత మేనేజర్లు, ఉద్యోగులు, విడివిడి కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఫేస్‌బుక్‌ తమ సంస్థలో కొన్ని కొత్త సంస్కరణలు తెచ్చింది. వాటిలో భాగంగా వీటికి స్వతంత్రతను తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేర్లలో కాస్త మార్పులు చేయనున్నట్లు ఈ వారం ప్రకటించింది. ఇకపై వాట్సప్‌ పేరును వాట్సప్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్‌గ అని మార్చనుంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/