ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై నిషేధం విధించిన ఫేస్‌బుక్‌

rajasingh
rajasingh

హైదరాబాద్‌: బిజెపి ఎమ్మెల్యే రాజాసంగ్‌ పై ఫేస్‌బుక్‌ యాజమాన్యం నిషేధం విధించింది. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రాజాసింగ్‌ ఫేస్‌బుక్ నియమాలను పాటించ‌లేద‌ని ఫేస్‌బుక్ యాజ‌మాన్యం తెలిపింది. హింస‌ను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి త‌మ‌ నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారు అని ఫేస్‌బుక్ ప్ర‌తినిధి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఖాతాపై నిషేధం విధించామ‌ని స్ప‌ష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/