సోనీలివ్‌లో జూలై 22 నుండి ఎఫ్ 3 స్ట్రీమింగ్

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3 . భారీ అంచనాల నడుమ మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎఫ్ 2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ ..ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సోనీలివ్‌లో జూలై 22 నుండి ఎఫ్ 3 స్ట్రీమింగ్ కాబోతుంది. మేకర్స్ తెలిపిన ప్రకారమే ఈ చిత్రం విడుదలైన 50రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది.
ఈ మధ్య కాలంలో సినిమాలన్ని దాదాపుగా నెలలోపే ఓటీటీలలో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ చిత్రం దాదాపు 8 వారాల తర్వాత డిజిటల్‌లోకి రావడం విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. తమన్నా, మెహరిన్‌లు కథానాయికలుగా నటించగా సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.