ఎఫ్ 3 చిత్ర రిలీజ్‌ను వాయిదా వేసిన డైరెక్టర్

ఎఫ్ 3 చిత్ర రిలీజ్‌ను వాయిదా వేసిన డైరెక్టర్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘ఎఫ్3’ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఎఫ్2కి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి నటిస్తున్నారు.

కాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను మరోసారి పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తు్న్నాడు. కాగా ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభన తీవ్రంగా ఉండటంతో సినిమా షూటింగ్‌లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎఫ్3 చిత్ర షూటింగ్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు.

అంతేగాక ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ సినిమా తదుపరి రిలీజ్ డేట్‌ను ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తరువాత అనౌన్స్ చేస్తామని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు. మరి ఎఫ్3 చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.