ఎఫ్ 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3 . భారీ అంచనాల నడుమ ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కథ పెద్దగా లేకపోయినప్పటికీ కామెడీ ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ వీక్ కు గాను ప్రపంచ వ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు

. తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.06 కోట్ల షేర్ వసూలు చేయగా.. టోటల్ వరల్డ్ వైడ్ గా 52.1 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలిపారు. ‘ఎఫ్ 3’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాలి కానీ ఈరోజు బాక్స్ ఆఫీస్ వద్దకు మేజర్ తో పాటు విక్రమ్ సినిమాలు వచ్చాయి. విక్రమ్ కు పెద్ద గా బజ్ లేనప్పటికీ , మేజర్ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ కావడం , హిట్ టాక్ తెచ్చుకోవడం తో దీని ప్రభావం ఎఫ్ 3 పడుతుందని అంత భావిస్తున్నారు.

ఇక ఫస్ట్ వీక్ ఎఫ్ 3 వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ గా షేర్ చూస్తే..

నైజాం – 17 కోట్లు
UA – 5.42 కోట్లు
తూర్పు – 3.2 కోట్లు
వెస్ట్ – 2.44 కోట్లు
సీడెడ్ – 6.7 కోట్లు
గుంటూరు – 3.20 కోట్లు
కృష్ణ – 3.1 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ – 41.06 కోట్లు

కర్ణాటక – 2.30 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.5 కోట్లు
ఓవర్సీస్ – 7.2 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ షేర్ – 52.1 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 94 కోట్లు సాధించింది.