‘ఎఫ్‌2’ పాట చిత్రీకరణ

F2
F2

‘ఎఫ్‌2’ పాట చిత్రీకరణ

హ్యాట్రిక్‌ విజయాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో అగ్రహీరో విక్టరీ వెంకటేష్‌ , యువ హీరో వరుణ్‌తేజ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘ఎఫ్‌2.. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్‌ చెక్‌ రిపబ్లిక్‌ దేశంలోని ఫ్రాగ్‌లో జరుగుతోంది.. దాదాపు 10 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ నేతృత్వంలో హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
ఈచిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా, వరుణ్‌కు జోడీగా మొహ్రీన్‌ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.