పుష్ప నుండి ”ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా” సాంగ్‌ రిలీజ్‌

పుష్ప టీం ఎక్కడ కూడా తగ్గడం లేదు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ ను ఇంకాస్త స్పీడ్ చేసారు. ఇప్పటికే మూడు సాంగ్స్ విడుదల చేసి అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లిన యూనిట్..ఈరోజు నాల్గో సాంగ్ ”ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా” విడుదల చేసారు. ఈ సాంగ్‌ లో అల్లు అర్జున్‌ అదర గొట్టాడు. ఊర మాస్‌ స్టెప్పులతో ..పూర్తి గా మాస్‌ లుక్‌ లో అల్లు అర్జున్ కనిపించాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

YouTube video