కళ్లు అలసిపోకుండా ఉండాలంటే..

ఆరోగ్యం -జాగ్రత్తలు – సలహాలు

Eyes fatigue
Eyes fatigue

కళ్లు అలసిపోకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులకు ఇది పరీక్షా కాలం..పరీక్షల వేళ ఎక్కువ గంటలు చదవటం అన్నది ఏ విధ్యార్ధికైనా తప్పదు.. అస్తమానం పుస్తకంలోని తలదూర్చటం వలన కళ్లు అలసిపోతాయి. నిజానికి దగ్గరి వస్తువుల్ని , దూరపు వస్తువుల్ని మార్చి మార్చి చూడటం అనేది సహజంగా జరగాలి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది.. కళ్ల అలసటను అరికట్టాలంటే పాటించాల్సిన నియమాలివి.

చదవటానికి కూర్చునే చోటు ఎలా ఉండాలంటే వెలుతురూ ధారాళంగా పడాలి.. దాన్తతో పాటే మధ్యలో దూర ప్రదేశాలను చూడటానికి వీలుగా ఉండాలి.. అందుకోసం కారిడార్ లోనో లేదా కిటికీ పక్కనో కూర్చోవాలి. ఒకవేళ గదిలో అలంటి వెసులుబాటు లేకపోతె, ఎదురుగా పెద్ద అడ్డమైనా అమర్చుకోవాలి.. అద్దంలోంచి చూడటం ద్వారా కంటి ఒత్తిడి కొంత తగ్గుతుంది..

ఇంట్లో గదులు చిన్నగా ఉంటే చదవటం మొదలుపెట్టిన ప్రతి 40 నిముషలకు ఒకసారి కుర్చీ లోంచి లేచి గది వెలుపల 5 నిముషాలపాటు అటూ ఇటూ తిరగాలి..
పరీక్షల దృష్టిలో చూస్తే ఎంత చదివాం అనేదాని కన్నా , ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాం అన్నదే ముఖ్యం.. రాత్రి అయ్యేసరికి సహజంగానే కళ్లు అలసిపోయి ఉంటాయి.. ఆ సమయంలో ఎంత చదివినా, విషయాలను గ్రహించటంగానీ , జ్ఞాపకం పెట్టుకోవటం గానీ తక్కువగానే ఉంటుంది.. అందువల్ల రాత్రి వేళ కన్నా, పొద్దున్నే చదవటం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.. ఒకవేళ రాత్రివేళ చదవటం తప్పని సరి అయితే , మసక వెలుగు కాకుండా, సరిపడా వెలుగు ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి.

ఎక్కువ గంటలు చదువుతున్నపుడు సహజంగానే కంటి రెప్పలు కొట్టుకోవటం తగ్గిపోతుంది.. దానివలన కళ్లు పొడిబారటం గానీ, మసక భారతం గానీ జరుగుతుంది.. కొందరికైతే కళ్ళు మండుతాయి కూడా.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మధ్య మధ్య తరచూ కళ్లు తేమగా ఉండి , చదవటంలో ఇబ్బంది అనిపించదు..

‘స్వస్థ ‘ (ఆరోగ్య సంబంధిత విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/