నయనానందకరం

                                         నయనానందకరం

EYES
EYES

మన శరీరంలో అన్నిటికన్నా సున్నితమైనవీ, విలువైనవీ కళ్లే. మరి అంత ముఖ్యమైన వాటి రక్షణకు మనమెంత జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా! మీరు మొహం కడుక్కున్నప్పుడల్లా కళ్లు కూడా కడుక్కోవాలి. నిద్రపోయే ముందు మొహం మీది మేకప్‌ని పూర్తిగా తొలగించెయ్యాలి. ఎక్కువనీళ్లు తాగటం, బైటికి వెళ్లినప్పుడు నల్లకళ్లద్దాలు పెట్టుకోవటం, కాఫీ ఆల్కహాలుని బాగా తగ్గించెయ్యటం ముఖ్యం. మీరు శరీరం పట్ల శ్రద్ధ కనబరిచినట్లయితే అది మీ కళ్ల చుట్టూ నల్లవలయాల రూపంలో దర్శనమిస్తుంది. ఆసక్తికరమైన విషయమే మిటంటే వయసు మీద పడటం కనిపించేది మొట్టమొదట కళ్లచుట్టూనే. మొదట్లో కళ్ల దగ్గర సన్నని గీతలు ఏర్పడవచ్చు. తరువాత కళ్ల చివర్లు ముడతలు పడటం, కళ్ల కింద నల్లటి నీడలు ఏర్పడటం, కళ్ల కింది చర్మం ఉబ్బినట్లు అవటం లాంటివి జరుగుతాయి.

కళ్ల చివర్లలో ముడతలు రాకుండా ఉండాలంటే గట్టిగా కళ్లని నులమకండి. మీ కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితమైనదనీ, ఒకసారి పాడైతే దాన్ని మళ్లీ యథాస్థితికి తీసుకురావటం కుదరని పని అనీ గుర్తుంచుకోండి. నశించిన కణజాలం మళ్లీ పూడుకోదు. వారానికి ఒకసారి కళ్లలో తడిని నిలిపి ఉంచేందుకు మంచి ఐడ్రాప్స్‌ని వాడండి. కళ్ల చుట్టూ ఉండే కణజాలం దెబ్బ తినటం వల్లే నల్లటి వలయాలూ, కళ్లు ఉబ్బటం లాంటి పరిణామాలు కనిపిస్తాయి. చర్మం కింద నీరు చేరటం, ఎలర్జీలు, మందులు వికటించటం, వారసత్వ లక్షణాలూ, నిద్రలేమి, ఒత్తిడి, వార్థక్యం, గర్భం దాల్చటం, ఆహారంలో లోటుపాట్లు, మేకప్‌కి మంచి వస్తువ్ఞలు వాడకపోవటం లాంటి వాటివల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. రాత్రి నిద్రపోయే ముందు, కళ్లకింద పూనుకోవటానికి బజార్లో దొరికే క్రీము రాయండి. కానీ రెండు నిమిషాలకన్నా ఎక్కువసేపు ఉంచుకోవద్దు.