కళ్లకి యోగా మంచిదేగా !

ఆరోగ్య సంరక్షణ

మన కళ్ళు అలసిపోవడం వలన నొప్పి, పొడిబారటం ఇతరత్రా సమస్యలు దీనికి తోడు మనం ఆలస్యంగా పడుకుని నిద్ర లేస్తుంటాం.. ఇదీ కళ్లపై ప్రభావం చూపుతుంది.. ఉపశమనం కలగాలంటే ‘ ఐ యోగా ‘ ను ప్రయత్నించ మంటున్నారు నిపుణులు..

రెండు అరచేతులను వేడెక్కే వరకూ రుద్ది మూసిన రెప్పలా మీద ఉంచండి.. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచిన తర్వాత ఇలా మూడు సార్లు తప్పక చేయండి.. కళ్ళు అలసిపోయినా ఇలా చేయొచ్చు…

ఎక్కువసేపు ఫోన్ చూసినా, కంప్యూటర్ మీద పనిచేసినా రెప్ప వాల్చటం మర్చిపోతుంటాం… ఫలితమే పొడిబారటం , నొప్పి , వగైరా .. అందుకే గుర్తొచ్చినప్పుడు కనురెప్పలను 10 నుంచి 15 సార్లు వెంటవెంటనే కొట్టండి.. కాస్త విరామం తీసుకుని మళ్ళీ మొదటినుంచి చేయండి.. ఇలా నాలుగుసార్లు చేయాలి..

ఒక వేలిని కళ్లకు కొద్ది దూరంలో ఉంచి.. కొద్ది సేపు దాన్నే ఉంచండి.. తర్వాత వేలిని కుడి, ఎడమ దిశల్లో తిప్పాలి.. అపుడు చూపు మాత్రం వేలిమీదే ఉంచాలి.. కొద్ది సేపు పక్కకు చూసి మళ్లీ కొనసాగించాలి.. వీటిని రోజుకు రెండు సార్లు చేస్తే కళ్ల సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది..

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/