ముందు ‘చూపు’ అవసరం
నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం

మానవ శరీర నిర్మాణంలో కంటిచూపు అన్నది ఓ అద్భుతం. శరీర భాగంలో ఏ అవయవంలో లోపమున్నా మనుగడకు కొద్దిగా ఇబ్బంది మాత్రమే ఉంటుంది. కానీ కంటిచూపు లేకుండా జీవించడం అత్యంత కష్టం. కంటిచూపు లేకుంటేజీవితమే అంధకారం అవ్ఞతుంది. ప్రకృతిలోని ఏ అందాన్ని ఆస్వాధించలేం. ఎటువంటి రసానుభూతులు పొందలేం. ఏమి చూడలేం. ఈ సకల చరచరా సృష్టిని కేవలం మనం కంటి ద్వారానే చూడగలం. మనసులో ముద్ర వేయగలం. కావ్ఞన అంతటి విలువ గల కళ్లను కాపాడుకునే బాధ్యత మనదే. దృష్టిలోపాలు కొందరికి పుట్టుకతో వస్తే మరికొందరికి వయోభారం కారణంగా ఏర్పడతాయి. మారిన జీవన పరిస్థితుల్లో ఈ రెండు కారణాలు కాకుండా కొన్ని స్వయంకృతంగా వస్తున్నాయి. చాలా మందికి విటమిన్-ఏ లోపం, పౌష్టికాహారం లేమి, ఎక్కువ మంది పిల్లలు కళ్లను అశ్రద్ధ చేస్తుంటారు.
తెలియక కొంత, నిర్లక్ష్యం కొంత. వెరసి తలనొప్పి, కళ్ల నొప్పి, కంటిలో నీరు కారడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం, మరీ తీవ్రత ఎక్కువైతే ఏవో మందులు వేసుకోవడం, చిన్నచిన్న చిట్కాలు పాటించడం జరుగుతుంటుంది. కొందరి కళ్లు సరిగా కనిపించటం లేదని, మసక మసకగా కనిపిస్తున్నాయని ఏందో ఒక కళ్లద్దాలు పెట్టుకుంటే సరిపోతుందిలే అనుకుంటుంటారు. ముఖ్యంగా నిరుపేద పిల్లల్లో పోషకాహార లోపం వలన, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కంటిచూపు మందగించడం కంటి సమస్యలు రావడం జరుగుతుంది. అదే పనిగా టీవీచూడడం, సెల్ఫోన్ విపరీతంగా చూడడం, సరిగ్గా నిద్రపోకపోవడం, కంటికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం, ఎక్కువ వెలుగు ఇచ్చే ఎల్ఇడి బల్బులు వాడడం, అలాగే చీకట్లో మొబైల్, టీవీ ఎక్కువసేపు చూడడం, అల్లరి చేస్తున్నారని చిన్న పిల్లల నుంచే మొబైల్, ట్యాబ్లు అదే పనిగా అలవాటు చేయడం లాంటి పనుల వల్ల కంటిచూపు సమస్యలు వస్తాయి.
నిర్లక్ష్యం చేస్తే శాశ్వతంగా పోయే అవకాశం ఉంటుంది. అంధత్వ సమస్యలపై ప్రజలను జాగృతం చేసే వీలున్నంత మేరకు ఎక్కువ మందికి మెరుగైన కంటిచూపు అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా అక్టోబర్ రెండో గురువారం రోజున ‘ప్రపంచ దృష్టి దినోత్సవం పేరిట అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. శరీర అవయవాల్లో కళ్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లతోపాటు రకరకాల కారణాల వలన కంటి సమస్యతో బాధపడుతున్నారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతో మమంది నేత్ర సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కళ్లద్దాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శిశువ్ఞలు కూడా దృష్టిలోపానికి గురవ్ఞతున్నారు. విద్యార్థులకు, పెద్దలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధమవ్ఞతుంది. ప్రపంచ దృష్టిదినోత్సవం పురస్కరించుకొని అక్టోబరు పది నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టాలని భావించింది. ఈ మేరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు
.ఈ కార్యక్రమాన్ని ఆరు దశల్లో రెండు సంవత్సరాలు పాటు నిర్వహిస్తారు. చిన్న వయస్సులోనే ఎక్కువగా టివీ చూడకుండా పెద్దలు జాగ్రత్త వహించాలి. మరీ దగ్గరగా కూర్చోకుండా టీవీకి 10 అడుగుల దూరం లోంచి టీవీ చూసేటట్లు చర్యలు తీసుకోవాలి. పిల్లల్లో దృష్టిలోపం రాకుండా 9 నెలల వయసులోనే విటమిన్-ఏ అందించాలి. పదునైన వస్తువ్ఞలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. ఆకుకూరలు అధికంగా పెట్టాలి. క్యారెట్, గుడ్లు, పాలు, యాపిల్, పౌష్టికాహారం తీసుకోవాలి. కంటికి ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. పిల్లలు పుస్తకాలు చదివేటప్పుడు వారిని గమనిస్తూ ఉండాలి. సరిగా కనపడకపోతే వారిని కంటివైద్యుని దగ్గరకు తీసుకుపోవాలి. గదిలో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో టీవీని వీక్షించకూడదు. ఒకవేళ చీకట్లో టీవీ వీక్షిస్తే కంటిపై టెలివిజన్ వెలుతురు పడిదృష్టిలోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రకమైన శ్రద్ధ వహిస్తే కంటిచూపుకు వచ్చే సమస్యలను అరికట్టవచ్చు.
- -కాళంరాజు వేణుగోపాల్
తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/kids/