కొనసాగుతున్న గోదావరిలో బోటు వెలికితీత యత్నాలు


ఐరన్‌ రోప్‌ తెగిపోవడంతో ఆగిన పనులు
ఈరోజు మరోసారి లంగరు వేయాలని నిర్ణయం

ap boat accident
ap boat accident

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రయాణికులతో వెళ్తూ మునిగిపోయిన బోటు వెలికితీత ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి రాష్ట్ర ప్రభుత్వం వెలికితీత బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. పద్దెనిమిది రోజు క్రితం ప్రయాణికులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ప్రయాణికుల్లో మరో 16 మంది జాడ ఇప్పటికీ తెలియదు. వారి కోసం కుటుంబ సభ్యులు కన్నీటితో ఎదురు చూస్తున్నారు. వీరంతా బోటులోనే చిక్కుకుని చనిపోయి ఉంటారన్న అభిప్రాయం నెలకొంది.

దీంతో బాధిత కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం బోటు వెలికితీత బాధ్యతను సత్యం బృందానికి అప్పగించింది. ఈ మేరకు రెండు రోజు క్రితమే రంగంలోకి దిగిన 25 మంది సభ్యుల బృందం రెండు కిలోమీటర్ల పొడవున్న ఇనుప తాడును బోటు మునిగిన ప్రాంతంలోకి వదిలింది. ఏదో బరువైన వస్తువు తాడుకు తగలడంతో బయటకు తీసే ప్రయత్నం ప్రారంభించింది. అయితే ఐరన్‌ రోప్‌ మధ్యలోనే తెగిపోవడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. దీంతో ఈరోజు మరోసారి లంగరువేసి బోటు కోసం ప్రయత్నించాలని సత్యం బృందం సిద్ధమవుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/