తేజస్‌ నుంచి విడివడిన ఇంధనట్యాంకు

fuel tank dropped
fuel tank dropped

బెంగళూరు: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సూలూరు ప్రాంతంలో తేజస్‌ నుంచి బాహ్య ఇంధన ట్యాంకు విడివడి కిందకు పడింది. మంగళవారం ఉదయం కోయంబత్తూరు సమీపంలోని సూలూరు ఎయిర్‌బస్‌ నుంచి తేలికపాటి యుద్ధ విమానం ఐన తేజస్‌ వెళ్తుండగా ఇంధన ట్యాంకు దాని ఊడి వ్యవసాయ క్షేత్రంలో కిందపడింది. ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ ఇంధన ట్యాంకు భారత వైమానిక దళానికి చెందినది. ఈ ఘటనలో ఎవరికీ ఏ నష్టం జరగలేదు. ఈ ఘటన అనంతరం యుద్ధ విమానం కూడా సురక్షితంగానే దిగింది. దీనిపై దర్యాప్తు చేపడతామని ఐఏఎఫ్‌ ప్రకటన చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/