ఐటీ రిటర్నుల గడువు పొడిగింపు

income Tax returns
income Tax returns

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపు పన్ను మదింపు(ఐటీఆర్‌) పత్రాల దాఖలు గడువును మరో నెల వరకు పెంచింది. 201819 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్‌ పత్రాలను ఆగస్టు 31వ తేదీ వరకు సమర్పించవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తులు, పన్నులు చెల్లించే ఉద్యోగులు, ఖాతాల ఆడిటింగ్‌ అవసరంలేని సంస్థలకు ఐటీఆర్‌లను దాఖలు చేయటానికి తొలుత విధించిన గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. గడువును పొడిగించాలనే డిమాండ్లు వస్తుండటంతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తదనుగుణంగా నిర్ణయం తీసుకుంది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/