రసాయన పరిశ్రమలో పేలుడు.. 8 మంది మృతి

explosion-in-maharashtra
explosion-in-maharashtra

ధూలె: మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఈ పరిశ్రమలో ఈరోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. దాదాపు వంద మంది కార్మికులు పనిచేస్తున్న రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు. కాగా కర్మాగారంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన గ్యాస్‌ సిలెండర్లు పేలడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఇతర అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/